
ABOUT US
ఉపోద్ఘాతం

18/10/2023 బుధవారం అనంతపురం లో శ్రీ పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారు , శ్రీ అంబికాపతి గారు, శ్రీ పాపుదేశి చంద్రశేఖర్ గార్ల ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర యూనియన్ ఆవిర్భావ సమావేశం అంబటి ఘంటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగినది. పెద్దలు , రాష్ట్ర నాయకులూ 26 జిల్లాల నుంచి హాజరుకావడం జరిగినది. గతంలో జరిగిన పొరబాట్లు ఈ యూనియన్ నందు జరగకుండా ఉండటానికి రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో యూనియన్ రిజిస్ట్రేషన్ చేయుటకు అవసరమగు డబ్బు చందారూపంలో ఇవ్వడానికి అందరూ మొగ్గుచూపారు. అలాగే యూనియన్ పేరు , భవిష్యత్ కార్యాచరణ పై చర్చించడం జరిగినది. యూనియన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్(వడ్రంగి) యూనియన్ గ సభ్యుల ఆమోదం మేరకు ప్రకటించడం జరిగినది. మరియు రిజిస్ట్రేషన్ కి వెళ్ళడానికి కార్యవర్గ సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగినది. యూనియన్ రథ సారధులు:- శ్రీ నాగేశ్వర్ రెడ్డిగారు(అనంతపురం) అధ్యక్షుడు గా , శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు(గుంటూరు) ప్రధాన కార్యదర్శి గా, శ్రీ తామర పల్లె మోహనరావు గారు(ప.గోదావరి) కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర కార్యవర్గం వివరాలు…
గౌరవ అధ్యక్షులు
శ్రీ నబి రసూల్ గారు
శ్రీ రామచంద్ర ఆచారి గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు
శ్రీ పట్నం అంబికపతి గారు
శ్రీ లక్కొజు సింహాచలం గారు
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
శ్రీ పప్పుదేసి చంద్రశేఖర్ గారు
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు : శ్రీ మోహన్ ఆచారి గారు
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి : శ్రీ గోరంట్ల ఫరూక్ గారు
రాష్ట్ర అధికార ప్రతినిధి: శ్రీ కొడకంటి సురేంద్రబాబు గారు
రాయలసీమ కన్వీనర్ : శ్రీ నాగరాజు గారు నియమించుకోవడం జరిగినది
ABOUT S.C.W.U A.P

సృష్టి ఆరంభంనుంచి చేతివృత్తుల వారే మొదటితరం ఇంజినీర్లుగా ప్రసిద్ధిచెందారు , రైతుకు నాగలి చేయుటద్వారా వ్యవసాయానికి , ఎడ్లబండి ద్వారా రవాణా కు మార్గం చూపింది వడ్రంగి (కార్పెంటర్)… Read More
QUICK LINKS
ADDRESS
- Near Gannavaram Airport, Vijayawada, Andhra Pradesh.
- +91 9866141378
- +91 9985078271

