UPDATES

ఎంపీ గారికి సత్కారం

పీలేరు మండల కార్పెంటర్స్ కాలనీ స్థలం రావడానికి ప్రధాన కారకులు అయినా ఎంపీ శ్రీ మిదున్ రెడ్డి కి రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు , పీలేరు మండల అధ్యక్షులు శ్రీ రెడ్డిబాబు గారు , ప్రధాన కార్యదర్శి శ్రీ అంబికాపతి గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి  గారు  పీలేరు మండల కార్పెంటర్స్ అందరూ మర్యాదపూర్వకంగా  కలిసి ఓ చిన్న సన్మానం చేయడం జరిగినది.

చిత్తూర్ కార్పెంటర్స్ ఎస్టేట్ ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ , ఎక్కడ జరగని విధంగా కార్పెంటర్స్ జీవితాలలో వెలుగులు నింపి , అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడానికి చిత్తూర్ కార్పెంటర్స్ కమిటీ ఆధ్వర్యంలో ,శ్రీ బుల్లెట్  సురేష్ గారి సహకారంతో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ  పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి చొరవతో 90 మందికి ఒకే స్థలంలో కార్పెంటర్స్ ఎస్టేట్  కి స్థలం కేటాయించడం అన్నది అద్భుతం. ఆ అద్భుతాన్ని సాధించడంలో ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర  సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్ర శేఖర్ గారు , రాష్ట్ర ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , చిత్తూర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమరేష్ గారు పడిన కష్టం మాటలకు అందనిది. కొండలు , బండలు పిండిచేసి చదును కార్యక్రమం ఓ యజ్ఞం ల చేసిన చిత్తూర్ కార్పెంటర్స్ కష్టం నేను ప్రత్యక్షంగా చూడటం జరిగినది. 

                            ఈరోజు 04/03/2024 సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు స్వహస్తాలతో , బులెట్ సురేష్ గారు , చిత్తూర్ జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా చిత్తూర్ కార్పెంటర్స్ ఎస్టేట్ ప్రారంభోత్సవం  కార్యక్రమం శ్రీ చంద్ర శేఖర్ గారు , శ్రీ మోహన్ ఆచారి గారు , కుమరేష్ గార్ల అధ్యక్షతన  వైభవంగా జరిగింది. చుట్టుపక్కల జిల్లాలు అన్నమయ్య జిల్లా నుంచి ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  శ్రీ అంబికాపతి గారి ఆధ్వర్యంలో , తిరుపతి జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి  శ్రీ సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కార్పెంటర్స్ విచ్చేయడం జరిగింది. చిత్తూర్ కార్పెంటర్స్ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరు అయ్యి ఓ పండుగల కార్యక్రమాం జరిగింది

ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ (పాకాల)

పాకాల మండల కార్పెంటర్స్ కి ,టైలర్స్ కి పీఎం ఉద్యోగ కల్పనా పథకం (PMEGP) కింద ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం సురేంద్ర బాబు షాప్ వద్ద DIC (district industries centre ) వారిచే నిర్వహించబడినది. ఈరోజు సాయంత్రం వరకు  9 సర్టిఫికెట్స్ చేయడం , 3 షాప్స్ ఫోటోలు ఆన్లైన్ చేయడం జరిగినది. కార్పెంటర్స్ , టైలర్స్ విచ్చేసి పాల్గొనడం జరిగినది 

పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మొట్టమొదటగా ఒక వృత్తిదారులకు ఒకేచోట సుమారు 300 ఇంటి స్థలాలు ఇవ్వడం అన్నది ఒక్క పీలేరు మండలంలో సాధ్యం అయింది.  కలసివుంటే ఎంతటి అసాధ్యం అయిన పని కూడా సాధ్యం అవుతుంది అని పీలేరు మండల కార్పెంటర్ సోదరులు నిరూపించుకున్నారు. శ్రీ పట్నం అంబికాపతి ఆచారి గారి సారధ్యంలో మండల కార్పెంటర్స్ అధ్యక్షులు శ్రీ రెడ్డి బాబు గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి గారు కమిటీ సభ్యులు కృషి ఫలితం ఈ కార్పెంటర్స్ కాలనీ. పనులు ,నిద్ర మానుకొని ఎన్నోసార్లు అధికారుల చుట్టూ , రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి , ఎగతాళిగా నవ్వుకున్నా వారిముందు సగర్వంగా నిలుచున్నా కృషివరులు.  కొండలు పిండిచేసి కార్పెంటర్స్ కి అభివృద్ధి చేసిన లేఔట్ ల ఇవ్వడం అన్నది, అతి తక్కువ సమయంలో పగలు రాత్రి అన్నది చూడకుండా వంతులవారీగా ఉంటూ పనులు చేయిస్తూ నాటి  స్వప్నాన్ని సజీవరూపంలో  చూపించడం అన్నది కేవలం పీలేరు మండల కార్పెంటర్స్ సోదరులకు మాత్రమే సాధ్యం. 

                         ఈరోజు  ఎంపీ శ్రీ మిథున్  రెడ్డి గారు , శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గార్ల చేతుల మీదుగా పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సం కార్యక్రమం జరిగినది. ఎంపీ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్పెంటర్స్ ,వారి కుటుంబ సభ్యులు హాజరుఅయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పీలేరు కార్పెంటర్స్ ఐక్యతకు

కార్పెంటర్స్ డే

మార్చ్ 27 తేదీని కార్పెంటర్స్ డే గ ప్రకటించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆరోజు ప్రభుత్వ ఆఫీసులయందు( హాస్పిటల్స్ , mro  mdo  ,పోలీస్ స్టేషన్ , పాఠశాలలలో ) ఉన్న రిపేర్ పనులను ఉచితంగా చేయడం ఆనవాయితీ . తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమాజసేవలో భాగంగా వృద్ధులకు , దివ్యంగులకు ఆహారం అందించడం జరిగినది. ముఖ్యఅతిధిగా స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్  యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు హాజరు అయ్యి తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘ సభ్యులను అభినందించడం జరిగినది. తీరుపతి సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ వెలుగరం కుప్పచారి , గౌరవ సలహాదారుడు శ్రీ నోటకర్ల మురళి ఆచారి , రాజశేఖర్ ఆచారి , మురళీధర్ , మోహన్ ఆచారి తదితరులు పాల్గొనడం జరిగినది