UPDATES
A day of carpenters__ చిత్తూరు జిల్లా
మేడే.. కార్మికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా అంతటా ఎర్రజెండాలు రెపరెపలాడాయి. వామపక్షాలు, కార్పెంటర్ సంఘాల ఆధ్వర్యంలో జెండాలు చేతబట్టి ర్యాలీగా ముందుకు కదిలారు. ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. ఎర్రజెండాలను ఎగురవేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులూ పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ పథకాలను వివరించారు. మేడే అనేది ఒక చారిత్రక గుర్తింపు కాదని.. పోరాటానికి పిలుపని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు మరియు చిత్తూర్ కార్పెంటర్ కమిటీ అధ్యక్షులు సత్య గారు కార్యదర్శి కుమారేశ్ గారు చంద్రశేఖర్ మోహనాచారితలు కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది

……………………………………………………………………………
A day of carpenters__ తిరుపతి జిల్లా
తిరుపతి కార్పెంటర్ అసోసియేషన్ వారి కార్పెంటర్ డే ఒక పండగ వాతావరణం నెలకొంది కార్పెంటర్ డే సందర్భంగా మన తిరుపతి కార్పెంటర్ సోదరులు సుమారు 150 మంది దాకా రక్తదానము 500 మందికి అన్నదాన కార్యక్రమం సుమారు 400 మంది కార్పెంటర్ సోదరులు బైక్ ర్యాలీగా వెళ్లి వాళ్ళ ఐక్యతను సాటి చూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి తిరుపతి మండల అధ్యక్షుడు కేవీ రత్నమాచారి గారు కార్యదర్శి వెలీగారం కుప్పాచారి గారు మరియు కమిటీ సభ్యులు అందరూ తో పాటు రాష్ట్ర స్టేట్ కార్పెంటర్ వర్కర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అంబికా పతి ఆచారి గారు పాల్గొనడం జరిగింది.

……………………………………………………………………………

associate with collector___తిరుపతి జిల్లా
🙏అసిస్టెంట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మన యొక్క సమస్యలను అలాగే మనకి వర్క్ షెడ్లకు సంబంధించి. బి ఎం ఎస్ ద్వారా 401 కార్పెంటర్ సోదరులకు వర్క్ షెడ్డు. లకు ఆకుల సతీష్ అన్న ద్వారా మెమరాండం ఇవ్వడం జరిగింది.🙏 అలాగే 27 కార్పెంటర్స్ డే కి చీఫ్ గెస్ట్ గా రమ్మని పిలవడం జరిగింది.🙏🙏

తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లా వడ్రంగి కార్మికులకు భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్కు భారతీయ మజ్జూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ రాయల్ విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ను ఆకుల సుబ్రహ్మణ్యం, సతీష్ రాయల్, సంయుక్త కార్యదర్శి వెంకటాద్రి యాదవ్లతో పాటు తిరుపతి జిల్లా నిర్మాణ కార్మిక సంఘానికి చెందిన సుమారు 400 మంది వడ్రంగి కార్మికులతో కలిసి వినతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆకుల సుబ్రహ్మణ్యం, సతీష్ రాయల్ మాట్లాడుతూ వడ్రంగి కార్మికుల కోసం ప్రత్యేక వర్క్ షెడ్లు ఏర్పాటు చేయడానికి 10 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. వడ్రంగి కార్మికులకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వడ్రంగి కార్మికులకు వర్క్ షెడ్లు ఏర్పాటు చేయడం ద్వారా పని వాతావరణం మెరుగుపడటంతో పాటు కార్మికుల జీవనోపాధి పెంపొంది అవకాశం ఉందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు.

వెబ్సైటు లాంచింగ్ , సైట్ రెజిస్ట్రేషన్
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సబ్యులకు శుభోదయం …. రాష్ట్ర కార్పెంటర్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గరోజు….. 19/04/24 వ తేదీ రాష్ట్ర కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ వెబ్సైటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో లాంచింగ్ చేయడం జరిగినది మరియు రాష్ట్ర కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ కొరకు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో స్థలం చూడటం , అగ్రిమెంట్ చేసుకోవడం అందరికి తెలిసిన విషయమే. రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో స్థలం కొనడంజరిగినది. రాష్ట్ర కార్యవర్గసభ్యుల సమక్షంలో , అందరి సహకారంతో స్ధలం గన్నవరం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు యూనియన్ కి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. రాష్ట్ర అధ్యాక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు ,ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు ,కోశాధికారి శ్రీ మోహన్ రావు గారు , రాష్ట్రఉపాధ్యక్షులు శ్రీ పట్నం అంబికాపతి గారు ,శ్రీ లక్కోజు సింహాచలం గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్ర బాబు గారు, రాయలసీమ కన్వినర్ శ్రీ నాగరాజు గారు ,పెద్దలు శ్రీ అబ్దుల్ సలంగారు , అన్నమయ్య జిల్లా కన్వినర్ శ్రీ రెడ్డి బాబు గారు , అన్నమయ్య జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ శంకర ఆచారి గారు , జిల్లా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ రహమతుల్లా గారు , జంగారెడ్డి గూడెం చిన్ని గారు , బల్లంకి చిట్టిబాబు గారు , వెబ్సైటు రాజు గారు , జావీద్ గారు , జంగారెడ్డి గూడెం రాంబాబు గారు , తిరుపతి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుప్పచారి గారు , అన్నమయ్య జిల్లా సురేష్ గారు మరియు గన్నవరం లోకల్ సంఘ నాయకులూ పాల్గొనడం జరిగినది

టీడీపీ ముఖ్యనాయకులు శ్రీ జనార్దన్ గారితో కార్పెంటర్స్ యూనియన్ నాయకులు
అందరికీ నమస్కారం….. స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ (వడ్రంగి) యూనియన్ రిజిస్టర్ నెంబర్ 501 ఆంధ్ర ప్రదేశ్ ఈరోజు యూనియన్ నాయకులు అయినటువంటి మన సోదరులు టిడిపి పార్టీలో ముఖ్యులు అయినా శ్రీ టి డి జనార్ధన్ గారిని కలవడం జరిగినది. ఆయనను కలిసి రాష్ట్ర కార్పెంటర్లు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి గత ప్రభుత్వంలో చాలావరకు కార్పెంటర్లు ఎదుర్కొన్న సమస్యల గురించి వారి బాధల గురించి ఆయనకు విన్నవించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్లి కార్పెంటర్ సమస్యల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేయించాలని కోరడం జరిగినది. వారు కూడా కార్పెంటర్ సమస్యల మీద సానుకూలంగా స్పందించి అతి త్వరలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఒప్పించి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగినది. అలాగే ఆయనకి ధన్యవాదాలు చెప్పి త్వరలో ఒక మీటింగు ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం జరిగినది. ఆ విషయంలో రాష్ట్ర నాయకులు జనరల్ సెక్రెటరీ పఠాన్ నాయబ్ రసూల్ రాష్ట్ర కోశాధికారి తామరపల్లి మోహన్ రావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు లకోజి సింహచలం గారు మరియు పీలేరు నుంచి మన ఉపాధ్యక్షులు పట్నం అంబికా ప్రతి ఆచారి గారు అధికార ప్రతినిధి సురేంద్రబాబు గారు అలాగే అన్నమయ్య జిల్లా కన్వీనర్ రెడ్డి బాబు గారు కలిసి చిరు సత్కారం చేసి రావడంజరిగినది

కార్పెంటర్స్ సమస్యలపై శ్రీ లోకేష్ గారితో యూనియన్ నాయకులు
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.. స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ నాయబ్ రసూల్ గారు ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ లాక్కోజు సింహాచలం గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని రాష్ట్ర కోశాధికారి శ్రీ తామర పల్లి మోహనరావు గారు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ అంబికపతి గారు ,అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీ రెడ్డిబాబు గారు , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ రహమతుల్లా గారు, బృందం కలవడం జరిగినది. పీలేరు కార్పెంటర్స్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యపై వారితో మాట్లాడటం జరిగింది. శ్రీ లోకేష్ గారు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. అలాగే ప్రస్తుతం మన కార్పెంటర్స్ పడుతున్న సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పడం జరిగినది. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రిగారికి ధన్యవాదాలు మన రాష్ట్ర కార్పెంటర్స్ తరపున చెప్పుకుంటూ

రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు శ్రీ చంద్రబాబు గారికి 1లాక్ అందచేసిన కార్పెంటర్స్ నాయకులు
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.. స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ నాయబ్ రసూల్ గారు ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ లాక్కోజు సింహాచలం గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని రాష్ట్ర కోశాధికారి శ్రీ తామర పల్లి మోహనరావు గారు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ అంబికపతి గారు ,అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీ రెడ్డిబాబు గారు , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ రహమతుల్లా గారు, బృందం కలవడం జరిగినది. పీలేరు కార్పెంటర్స్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యపై వారితో మాట్లాడటం జరిగింది. శ్రీ లోకేష్ గారు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. అలాగే ప్రస్తుతం మన కార్పెంటర్స్ పడుతున్న సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పడం జరిగినది. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రిగారికి ధన్యవాదాలు మన రాష్ట్ర కార్పెంటర్స్ తరపున చెప్పుకుంటూ

రాష్ట్ర సర్వసభ్య సమావేశము
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సర్వసభ్యసమావేశం అనంతపురం పట్టణం లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 19/12/2024 వ తేదీ NS గ్రాండ్ నందు ఉదయం 10గంటలకు ప్రారంభమైనది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , యూనియన్ సభ్యులు పలు జిల్లాలనుంచి పెద్దమొత్తంలో హాజరుకావడం జరిగినది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం , గత కార్యక్రమాలపై చర్చించడం జరిగినది. భవిష్యత్ కార్యాచరణ , నూతన సంవత్సర క్యాలెండర్ ముద్రణ , సభ్యత్వాలపై సమాలోచన చేయడం జరిగినది. పలువురు సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకొని వాటిపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు నూతన నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం పై విస్తృత చర్చ జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ , కోశాధికారి శ్రీ మోహన్ రావు గార్ల పర్యవేక్షణలో సమావేశం జరపబడింద

work behind registration of union
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం…25/07/24 ఈరోజు గన్నవరం విమానాశ్రయం దగ్గర యూనియన్ ఆఫీస్ కొరకు గతంలో కొని రిజిస్ట్రేషన్ చేసిన స్థలం ఇప్పుడు పూర్తిగా యూనియన్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాయబ్ రసూల్ గారు , ఉపాధ్యక్షుడు శ్రీ అంబికపతి గారు , రాష్ట్ర కోశాధికారి శ్రీ మోహనరావు గారు , పెద్దలు శ్రీ అబ్దుల్ సలాం గారు , ఉపాధ్యక్షుడు శ్రీ సింహాచలం గారు , అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు ,రాయలసీమ కన్వీనర్ శ్రీ నాగరాజు గారు, రెడ్డి బాబుగారు , శంకరాచారి గారు , సూర్యనారాయణ గారు , రహమతుల్లా గారు తదితరులు పాల్గొనడం జరిగినది

